విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:46 PM
కేతన్ అగర్వాల్ విగ్ పెట్టుకోవడం ఇష్టంలేని కారణంగానే సియా గోయల్ అతడిని హత్య చేసిందని జరుగుతున్న ప్రచారంపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ స్పందించారు. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సియా తన కొడుకును చంపడానికి, అతడు విగ్ పెట్టుకోవడానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ముంబై, జూన్ 26: కేతన్ అగర్వాల్ విగ్ పెట్టుకోవడం ఇష్టంలేని కారణంగానే సియా గోయల్ అతడిని హత్య చేసిందని జరుగుతున్న ప్రచారంపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ స్పందించారు. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సియా తన కొడుకును చంపడానికి, అతడు విగ్ పెట్టుకోవడానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎంగేజ్‌మెంట్ జరగడానికి ముందే కేతన్ విగ్ పెట్టుకుంటాడని సియా కుటుంబసభ్యులకు తెలుసునని అన్నారు. విశాల్ మీడియాతో మాట్లాడుతూ..
‘కేతన్ చిన్న విగ్ ప్యాచ్ పెట్టుకుంటాడన్నది నిజం. ఎంగేజ్‌మెంట్‌కు ముందే మేము ఈ విషయం గురించి సియాకు, ఆమె కుటుంబసభ్యులకు చెప్పాము. సియాకు ఏదైనా సమస్య ఉంటే.. అప్పుడే నో చెప్పేది. నా కొడుకును చంపాల్సిన అవసరం ఏముంది?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సియా తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలపై కూడా ఆయన స్పందించారు. ‘మా కూతురిని లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు రమ్మని కేతన్ బలవంతం చేశాడు’ అని సియా తల్లిదండ్రులు అంటున్నారు.
ఈ ఆరోపణలపై విశాల్ అగర్వాల్ స్పందిస్తూ.. ‘నాకు తెలిసినంత వరకు.. సియా ట్రెక్కింగ్‌కు వెళదామని కోరింది’ అని అన్నారు. సియా తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. ‘పెళ్లి ఫిక్స్ చేయడానికి ముందు చాలా సార్లు సియాను పెళ్లి ఇష్టం ఉందా అని అడిగాం. ఓ పది సార్లు అడిగి ఉంటాము. మేము అడిగిన ప్రతీసారి.. కేతన్ అంటే ఇష్టమనే చెప్పింది. ఎప్పుడూ కూడా అతడంటే ఇష్టం లేనట్లు సియా ప్రవర్తించలేదు. ఆమె వేరే రిలేషన్‌లో ఉందన్న సంగతి కూడా మాకు తెలియలేదు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..
శిథిలాలు తవ్వే కొద్దీ ప్రాణాలతో బయటపడుతున్న మనుషులు, మూగ జీవాలు..