Share News

శిథిలాలు తవ్వే కొద్దీ ప్రాణాలతో బయటపడుతున్న మనుషులు, మూగ జీవాలు..

ABN , Publish Date - Jun 26 , 2026 | 04:55 PM

కరాకస్ నగరంలో భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 235 మంది చనిపోయారు. 4 వేలకుపైగా మంది గాయపడ్డారు. దాదాపు 28 వేల మంది ఆచూకీ లభించలేదు.

శిథిలాలు తవ్వే కొద్దీ ప్రాణాలతో బయటపడుతున్న మనుషులు, మూగ జీవాలు..
Venezuela Earthquake

ఇంటర్‌నెట్ డెస్క్: వెనెజువెలాలో చోటుచేసుకున్న వరుస భూకంపాల కారణంగా భారీ విధ్వంసం చోటుచేసుకుంది. కరాకస్ నగరంలో భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. భూకంపాల కారణంగా ఇప్పటి వరకు 235 మంది చనిపోయారు. 4 వేలకుపైగా మంది గాయపడ్డారు. దాదాపు 28 వేల మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సహాయక సిబ్బంది ఎంతో కష్టపడి శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షిస్తున్నారు.


ప్రాణాలతో చిన్న పిల్లలు, మూగజీవాలు..

సహాయక సిబ్బంది శిథిలాల కింద నుంచి చిన్న పిల్లలు, మూగ జీవాలను ప్రాణాలతో బయటకు తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అమర్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. సహాయక సిబ్బంది ఓ చంటి పిల్లాడిని శిథిలాల కిందనుంచి బయటకు తీశారు. ఆ పిల్లాడు ఎలాంటి గాయాలు లేకుండా.. ప్రాణాలతో ఉండటం సహాయక సిబ్బందిని సంతోషంలో ముంచెత్తింది. సిబ్బంది బిడ్డను శిథిలాల నుంచి పైకి తీసి అక్కడే నిలబడ్డ ఓ వ్యక్తికి అప్పగించారు.


వోల్కాహాలిస్ ఎక్స్ ఖాతాలో విడుదలైన వీడియోలో.. ఓ కుక్క గొంతు వరకు శిథిలాల మధ్య చిక్కుకుపోయింది. అది సాయం కోసం దీనంగా చూస్తోంది. సహాయక సిబ్బంది ఎంతో కష్టపడి దాన్ని బయటకు తీశారు. జాన్నెలీ గొంజలెజ్ అనే మహిళ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. గోడ దగ్గర శిథిలాల కింద ఓ బాలుడు చిక్కుకుపోయాడు. సహాయక సిబ్బంది ఆ బాలుడిని బయటకు తీశారు. ఇక, ఈ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలను రక్షిస్తున్న సహాయక సిబ్బందిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

పల్నాడులో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష

వరల్ట్ నం.1 బౌలర్ కావడంపై స్పందించిన శ్రీ చరణి

Updated Date - Jun 26 , 2026 | 05:15 PM