పల్నాడులో వరుస రోడ్డు ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:41 PM
పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఉన్నతాధికారులతో ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అమరావతి, జూన్ 26: పల్నాడు జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఉన్నతాధికారులతో ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఈరోజు(శుక్రవారం) కలెక్టర్, ఎస్పీలతో మంత్రి మాట్లాడారు. యాక్సిడెంట్ స్పాట్స్ గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వాహనం పాడైనా, ఏదైనా కారణం చేత రోడ్డు మీద ఆగిపోతే వెనక వచ్చే వాహనాలకు ఆ విషయం తెలిసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీకి దిశానిర్దేశం చేశారు.
మాచర్ల ప్రమాదంపై దిగ్బ్రాంతి...
పల్నాడు జిల్లా మాచర్ల నగరవనం వద్ద రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందటం పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
ప్రమాద వివరాలు...
పల్నాడు జిల్లా మాచర్ల సమీపంలోని నగరవనం వద్ద లారీ, తుఫాను వాహనం ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వేగంగా వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బాధితులు హైదరాబాద్‌కు చెందిన వారుగా పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు: మంత్రి అచ్చెన్నాయుడు
ఘనంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
Read Latest AP News And Telugu News