ఘనంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:18 PM
నెల్లూరు జిల్లాలోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. రొట్టెల పండుగ ఏర్పాట్లను, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు.
నెల్లూరు, జూన్ 26: జిల్లాలోని బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు. స్వర్ణాల చెరువులో రొట్టెను వదిలి.. రొట్టెను పట్టుకున్నారు. ఆపై, దర్గాలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 412 సంవత్సరాల చరిత్ర ఉన్న బారాషహీద్ దర్గాలో ప్రతి ఏటా భక్తులు పెరుగుతున్నారని తెలిపారు. 2014కి ముందు 4 లక్షల మంది భక్తులు వచ్చేవారని.. సరైన వసతులు ఉండేవి కావన్నారు. ఇప్పుడు వసతులు పూర్తిగా పెంచి అభివృద్ధి చేశామని చెప్పారు.
గత ప్రభుత్వం దర్గా అభివృద్ధిని పక్కన పెట్టిందని మంత్రి విమర్శించారు. టూరిజం హబ్‌గా నెల్లూరు బారాషహీద్ దర్గాని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎంతో నమ్మకంతో దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారన్నారు. స్వర్ణాల చెరువులో నీటి శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. 6315 మంది మున్సిపల్ శాఖ సిబ్బంది, 1870 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను సిద్ధం చేశామని... బోట్ షికారు కోసం 8 రకాల బోట్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, అందరూ బాగుండాలని రొట్టె పట్టుకున్నట్లు నారాయణ తెలిపారు.
ఏర్పాట్లు అద్భుతం: ఎంపీ మాగుంట
50 ఏళ్లుగా రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈసారి చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేశారని కొనియాడారు. 2014 తర్వాత చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నారాయణ దర్గా అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. టూరిజం స్పాట్‌గా బారా షహీద్ దర్గాను తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉందన్నారు. చెరువుని ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
డ్రగ్స్ వద్దు బ్రో’.. యువతకు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు
నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులు: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest AP News And Telugu News