‘డ్రగ్స్ వద్దు బ్రో’.. యువతకు పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jun 26 , 2026 | 01:08 PM
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం ఇచ్చారు. డ్రగ్స్‌పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమే అని అన్నారు.
అమరావతి, జూన్ 26: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం ఇచ్చారు. డ్రగ్స్‌పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడటమే అని అన్నారు. ఏపీలో డ్రగ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారినపడ్డ వారికి అన్ని విధాలా సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామన్నారు. గౌరవప్రదమైన పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఏపీలో డ్రగ్స్‌కు చోటు లేదని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్ ట్రాఫికింగ్‌పై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెలుతోందన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్తు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. #DrugsOdhuBro ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిస్తూ.. డ్రగ్స్ వద్దు బ్రో హాష్ ట్యాగ్‌కు తన పోస్ట్‌ను సీఎం చంద్రబాబు ట్యాగ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్
సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్
Read Latest AP News And Telugu News