Share News

సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:21 PM

ఏపీలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్‌ విచారణలో బయటపడింది.

సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్
Sai Krishna case

విజయవాడ, జూన్ 26: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి రోజు రోజుకూ కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజుతో కలిసి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, సీఐ స్నేహితుడు మాయం చేసినట్లు సిట్‌ విచారణలో బయటపడింది. సీఐ నాగరాజు అరెస్ట్ తరువాత హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, జంగం నాని, స్నేహితుడు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీఐ పేరు చెప్పుకుంటూ ప్రైవేట్ వ్యవహరాలు నడపడంలో హెడ్ కానిస్టేబుల్ నాని కీలకంగా ఉన్నట్లు సమాచారం.


గన్నవరంలో సస్పెండ్ కాగా, పటమట స్టేషన్‌లో అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన అభియోగాల నేపథ్యంలో జంగం నానిని ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఇటీవలే కృష్ణలంకలో హెడ్ కానిస్టేబుల్‌గా నానికి పోస్టింగ్ ఇచ్చారు. సాయికృష్ణ లాకప్‌ డెత్ తరువాత మృతదేహాన్ని మాయం చేయడంలో సీఐ నాగరాజుతో కలిసి అశోక్, నాని, సురేష్ ముఖ్యపాత్ర పోషించినట్లు విచారణలో సిట్ తేల్చింది. సీడీఆర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ ముగ్గురూ కీలకంగా ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో పరారీలో ఉన్న ముగ్గురి కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి

తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన.. వైసీపీ శ్రేణుల ఓవరాక్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 12:32 PM