కోనసీమలో రోడ్డు ప్రమాదం.. టీడీపీ నేత మృతి
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:49 AM
కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
కోనసీమ జిల్లా, జూన్ 26: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మోకా లోవరాజు మృతి చెందాడు. కాట్రేనికోన గ్రామానికి చెందిన లోవరాజు గత రాత్రి బైక్‌పై వస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. గెద్దనాపల్లి గ్రామ సమీపంలో ప్రదాన రహదారిపై రాత్రి బైక్‌తో ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తలపై గాయాలతో పడి ఉన్న లోవరాజును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ద్విచక్ర వాహనం అదుపుతప్పడం వల్ల జరిగిన ప్రమాదమే టీడీపీ నేత మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు లోవరాజు కాట్రేనికోనలో బిర్యానీ వ్యాపారం నిర్వహిస్తూ, టీడీపీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారని స్థానికులు చెబుతున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లోవరాజు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. టీడీపీ నేత మృతిపట్ల ఆ పార్టీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
Read Latest AP News And Telugu News