అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jun 26 , 2026 | 09:29 AM
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.
అమరావతి, జూన్ 26: అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
బాధితులకు అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని వారికి సూచించారు. ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.
అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో కారు, ఆటో డీకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పీలేరు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పీర్ల పండగ ముగించుకుని ఆటోలో వస్తున్న కుటుంబంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముబారక్, మెహరున్ బీ, వాహిద్ అక్కడికక్కడే మరణించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ముస్లిం సోదరులకు మోహర్రం శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు, లోకేశ్
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్.. కేతిరెడ్డిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు
For More AP News And Telugu News