Share News

సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్.. నవ్వకుండా ఉండటం అసాధ్యమంటూ కామెంట్!

ABN , Publish Date - Jun 26 , 2026 | 10:28 AM

నిరంతరం అధికారిక సమీక్షలు, రాజకీయ ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ముఖంపై చిరు నవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు.

సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్.. నవ్వకుండా ఉండటం అసాధ్యమంటూ కామెంట్!
AP CM Chandrababu's Funny X Post Featuring 'Aarna IAS' Goes Viral

అమరావతి, జూన్ 26: నిరంతరం అధికారిక సమీక్షలు, పర్యటనలు, రాజకీయ ఒత్తిళ్లతో బిజీగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తన ఎక్స్ ఖాతాలో ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను చూసి ముఖంపై చిరు నవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా అసాధ్యం అంటూ ఆయన క్యాప్షన్ కూడా పెట్టారు. సదరు వీడియో విషయానికొస్తే, 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరో వెంకటేష్ చెప్పే సరదా మాటలు బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుండగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐఏఎస్ అధికారి కుర్చీలో కూర్చున్న చిన్నారి ఆర్నా (Aarna) వీడియో కాల్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతున్నట్లుగా రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


ఇక ఆ వీడియోలో చిన్నారి ఆర్నా ముందు 'ఆర్నా ఐఏఎస్ – విశాఖపట్నం' అనే నేమ్‌ప్లేట్, జాతీయ జెండా, ల్యాప్‌టాప్ కనిపిస్తుండగా, స్క్రీన్‌పై సీఎం చంద్రబాబు వీడియో కాల్‌లో కనిపిస్తున్నారు. మరో సన్నివేశంలో చిన్నారి చేతిని ఊపుతూ 'బై సీబీఎన్ అంకుల్, 'నేనిప్పుడు మీతో మాట్లాడలేను' అంటూ.. 'టీవీ కట్టేసి, నన్ను క్షమించు నాన్నా నిన్ను వెయిట్ చేయించానని ఆయన కాళ్లమీద పడ్డా' అంటూ సాగే సినిమా డైలాగ్ వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారిని ప్రేమగా గమనిస్తున్న తండ్రి కూడా వీడియోలో కనిపిస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో సీఎం చంద్రబాబు తన అధికారిక X ఖాతాలో పంచుకోవడంతో ఆ పోస్ట్.. కాసేపటికే వైరల్ గా మారుతోంది. చిన్నారిలోని అమాయకత్వం, సృజనాత్మకంగా రూపొందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఆనందాన్ని పంచుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

పూర్తి భద్రత ప్రమాణాలతో సంగం ఉత్పత్తులు

సైబర్‌ ఫిర్యాదులకు ఇకపై ఈ- జీరో ఎఫ్‌ఐఆర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 26 , 2026 | 11:34 AM