IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:38 PM
నేటి నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ సాధించాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
భారత్ ఆహ్వానం మేరకు ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లోకి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం కానుంది. ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టులో అతడికి అవకాశం లభించలేదు. దీంతో అతడి అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది.
తుది జట్లు:
భారత్:
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఐర్లాండ్:
టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్/కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్
ఇవి కూడా చదవండి:
వరల్ట్ నం.1 బౌలర్ కావడంపై స్పందించిన శ్రీ చరణి
నెట్స్‌లో సీనియర్లను వణికించేస్తున్న వైభవ్.. వీడియో వైరల్