Share News

నెట్స్‌లో సీనియర్లను వణికించేస్తున్న వైభవ్.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 26 , 2026 | 03:05 PM

భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే తాజాగా బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియో మాత్రం క్రికెట్ ప్రియులను ఖుషీ చేస్తోంది.

నెట్స్‌లో సీనియర్లను వణికించేస్తున్న వైభవ్.. వీడియో వైరల్
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోచింగ్‌ సిబ్బంది నుంచి కూడా స్పష్టత రాలేదు. కానీ, తాజాగా బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియో మాత్రం క్రికెట్ ప్రియులను ఖుషీ చేస్తోంది. ఆ వీడియోతో వైభవ్ డెబ్యూ చేయడం ఖాయమనే భరోసా ఫ్యాన్స్‌కు వచ్చింది. మరి.. బీసీసీఐ రిలీజ్ చేసిన ఆ వీడియో ఏమిటో ఇప్పుడు చూద్దాం...


బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో నెట్స్‌లో సీనియర్ బౌలర్ల బౌలింగ్‌లో వైభవ్ భారీ షాట్లు కొడుతున్నాడు. ప్రత్యేకించి అతను ఆడుతున్న 'నో-లుక్ షాట్' అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైభవ్ ప్రాక్టీస్ వీడియోలు ఏకంగా బీసీసీఐనే పోస్టు చేయడంతో ఇవాళ్టి మ్యాచ్‌లో అతడి అరంగేట్రం ఖాయమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఒకవేళ అతడిని ఎంపిక చేస్తే.. ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది.


కాగా, ఈ సంచలన ఆటగాడిపై ఐర్లాండ్ వికెట్ కీపర్ బెన్ కాలిట్జ్ స్పందిస్తూ.. ‘మాతో ఎవరు ఆడినా ఒకేలా చూస్తాం. విరాట్ కోహ్లీనా.. శ్రేయస్‌ అయ్యరా.. లేదా సూర్యవంశీనా అనే సంగతి పక్కన పెడతాం. ప్రతి ఒక్కరితోనూ మెరుగైన క్రికెట్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తాం. వారి ఆటతీరును నిశితంగా గమనించి.. అందుకు తగినట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మ్యాచ్‌ సమయంలోనూ వ్యూహాలు మారిపోతూ ఉంటాయి. టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌ జట్టు. కానీ, వారిలోనూ కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని ఆసరా చేసుకొని విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని కాలిట్జ్‌ వ్యాఖ్యానించాడు.


ఇవి కూడా చదవండి:

తుది జట్టులోకి సూర్యవంశీ ఎంట్రీపై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

పోరాడి ఓడిన అమెరికా.. తుర్కియే చేతిలో 2-3తో పరాజయం!

Updated Date - Jun 26 , 2026 | 03:17 PM