Share News

సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!

ABN , Publish Date - Jun 26 , 2026 | 02:27 PM

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశాన్ని దాటి.. అంతర్జాతీయ సరిహద్దులను తాకింది. తాజాగా ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశాన్ని దాటి.. అంతర్జాతీయ సరిహద్దులను తాకింది. మైదానంలో అతడి మెరుపులు చూసేందుకు స్వదేశీ అభిమానులే కాక.. విదేశీ ప్రేక్షకులు సైతం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఐర్లాండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. వైభవ్ ఆటను మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఐర్లాండ్ అభిమానులు ఆసక్తి కనబరచారు. దీంతో విక్రయానికి ఉంచిన తొలి టీ20 మ్యాచ్ టికెట్లన్నీ క్షణాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.


ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ ఛైర్మన్ బ్రియాన్ మాక్‌నీస్ స్వయంగా వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో వైభవ్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ టికెట్ల విక్రయాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కేవలం అతడి బ్యాటింగ్ విధ్వంసాన్ని చూసేందుకే అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారని, దీంతో ఈ మ్యాచ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయని తెలిపారు.


ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న ఈ యువ ఆటగాడి ప్రభావం గ్రౌండ్‌లోనే కాదు.. టికెట్ విండోల వద్ద కూడా స్పష్టంగా కనిపిస్తోందంటూ బ్రియాన్ మాక్‌నీస్ ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తానికి ఐర్లాండ్ వేదికగా వైభవ్ సూర్యవంశీ సృష్టించబోయే అద్భుతాన్ని చూసేందుకు క్రికెట్ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే అతడు తుది జట్టులో ఉంటాడా లేదా అనే దానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఈ విషయంపై టాస్ పడే సమయానికి క్లారిటీ వస్తుంది.


ఇవి కూడా చదవండి:

తుది జట్టులోకి సూర్యవంశీ ఎంట్రీపై బ్యాటింగ్ కోచ్ కీలక వ్యాఖ్యలు

పోరాడి ఓడిన అమెరికా.. తుర్కియే చేతిలో 2-3తో పరాజయం!

Updated Date - Jun 26 , 2026 | 03:13 PM