Share News

వెనెజువెలాలో శిథిలాల మధ్య బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..

ABN , Publish Date - Jun 26 , 2026 | 02:35 PM

శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెనెజువెలాలో శిథిలాల మధ్య బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..
Venezuela earthquake 2026

ఇంటర్‌నెట్ డెస్క్: వెనెజువెలా రాజధాని కరాకస్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వరుసగా రెండు భూకంపాలు వచ్చాయి. 5 నిమిషాల వ్యవధిలో చోటుచేసుకున్న రెండు భూకంపాలు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇప్పటి వరకు 235 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,300 మంది గాయాలపాలయ్యారు. శ్మశాన నిశ్శబ్దం నెలకొన్న వెనెజువెలాలో ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది. ఓ మహిళ శిథిలాల మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వరుస భూకంపాలు విధ్వంసం సృష్టించిన కరాకస్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల మధ్య చిక్కుకుపోయిన వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువస్తున్నారు.


ఈ నేపథ్యంలోనే గర్భిణిని రెస్క్యూ సిబ్బంది శిథిలాల నుంచి రక్షించారు. ఆమెను బయటకు తీసుకువచ్చిన కొంతసేపటికే పురిటినొప్పులు మొదలయ్యాయి. ఇది గమనించిన అక్కడ ఉన్న మహిళలు కాన్పు చేయడానికి పూనుకున్నారు. అతి కష్టం మీద గర్భిణి ప్రాణాలకు ఎలాంటి అపాయం కలగకుండా కాన్పు చేశారు. గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఆ వీడియోలో కాన్పునకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘దేవుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఆ శిథిలాల మధ్య ఓ బిడ్డ ఊపిరి పోసుకుంది’..‘గర్భిణికి కాన్పు చేసిన ఆ మహిళలకు ధన్యవాదాలు’.. ‘వినాశనాలు జరిగిన చోట ప్రకృతి మనకు ఇస్తున్న ఓ చిన్న నమ్మకమే ఆ బిడ్డ జన్మ’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

సూర్యవంశీ క్రేజ్.. క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు!

అయోధ్య నిధుల దుర్వినియోగం.. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా..

Updated Date - Jun 26 , 2026 | 02:53 PM