గర్భస్థ శిశువుకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలి
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:54 AM
తన బిడ్డకు జన్మనివ్వనున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన భర్తే అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేశాడు.
అనుమానంతో గర్భిణికి భర్త, అత్త వేధింపులు
మనస్తాపంతో ఉరేసుకుని బాధితురాలి ఆత్మహత్య
హత్య చేశారంటున్న మృతురాలి తల్లి
అల్లాదుర్గం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): తన బిడ్డకు జన్మనివ్వనున్న భార్యను అపురూపంగా చూసుకోవాల్సిన భర్తే అనుమానంతో ఆమెను వేధింపులకు గురిచేశాడు. గర్భస్థ శిశువుకు డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తానంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించాడు. అతని తల్లి కూడా వేధింపులకు పాల్పడుతుండడంతో మనస్తాపం చెందిన 5 నెలల గర్భిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఎస్సై శంకర్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మోత్కుపల్లికి చెందిన గాజుల సుస్మిత (23)కు ఏడాదిన్నర క్రితం అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కి చెందిన గాజుల అభిలా్‌షతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి అయిన సుస్మితపై అనుమానంతో... ఆమె కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్‌ఏ టెస్ట్ చేయించాలంటూ నిత్యం భర్త అభిలాష్, అత్త శశిరేఖ వేధింపులు మొదలుపెట్టారు. వీటిని తాళలేక సుస్మిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. అయితే తన కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ సుస్మిత తల్లి జనబాయి.. అభిలాష్,శశిరేఖపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.