ఈ ఏరియాల్లో 11గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:51 AM
గ్రీన్ ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.
నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: గ్రీన్ ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాత్మా నగర్ ఫీడర్ పరిధిలోని మహాత్మానగర్, హాబీబ్‌ఫాతిమా నగర్ ఫేస్ 1, 2, ఇందిరా నగర్, శ్రీరామ్ నగర్,
సంజయ్ నగర్, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ఎస్.ఆర్.టి నగర్ మార్కెట్ ఫీడర్ పరిధిలోని వినాయక్‌రావు నగర్, ఎస్.ఆర్.టి మార్కెట్, బోరబండ, ఇందిరా నగర్,భరత్ నగర్, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు బోరబండ ఫీడర్ పరిధిలోని టి.అంజయ్య నగర్, ఇందిరా నగర్ ఫేజ్-3, సైట్ 5, నూర్ మజీద్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
Read Latest Telangana News and National News