హైదరాబాద్‌లో ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:30 AM
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో...
బంజారాహిల్స్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో 76 అడుగుల చంద్రబాబు కటౌట్ ఏర్పాటు చేసి డ్రోన్ ద్వారా పూల వర్షం కురిపించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, విజయవాడ కనకదుర్గా దేవాలయం బోర్డు సభ్యులు హరికృష్ణ, టీటీడీ బోర్డు సభ్యుడు నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తదితరులు పాల్గొన్నారు. తెలుగు యువత అధ్యక్షుడు పొగాకు జైరామ్ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు వద్ద వాయిసెస్ ఫర్ సీబీఎన్ పేరిట కార్యక్రమం నిర్వహించారు. దీనికి నందమూరి రామకృష్ణ, నటుడు నారా రోహిత్, సినీ నిర్మాత బండ్ల గణేశ్ హాజరై కేక్ కట్ చేశారు.