వైరా-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:36 AM
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభమైంది.
ఎంత దూరం ప్రయాణిస్తే.. అంతే టోల్ ఫీజు
హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు తగ్గనున్న 50 కి.మీ. దూరం
బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లకు ప్రవేశం లేదు
కొయ్యలగూడెం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభమైంది. వైరా వద్ద ప్రాజెక్ట్ పీడీ దివ్య టోల్‌గేట్‌లను ప్రారంభించారు. వైరా నుంచి ఏలూరు జిల్లా పొంగుటూరు వరకు ఉన్న 116వ కిలోమీటర్ దాకా టోల్‌గేట్‌లు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ బిల్లు పడనుంది. అయితే ఎంత మేర ప్రయాణిస్తే అంతవరకే ఫీజు వసూలు చేస్తారు. తెలంగాణలో 33వ కిలోమీటర్ నుంచి ఏపీలోని పొంగుటూరు 149 కిమీ వరకు టోల్‌చార్జీలు పడనున్నాయి. ఈ రహదారి వల్ల హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే వారికి 50 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలకు అనుమతి లేదు.