Share News

మత్య్సకారుల మధ్య వేమిరెడ్డి సందడి

ABN , Publish Date - Apr 21 , 2026 | 06:26 AM

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సోమవారం మత్స్యకారుల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.

మత్య్సకారుల మధ్య వేమిరెడ్డి సందడి

ఇంటర్నెట్ డెస్క్: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సోమవారం మత్స్యకారుల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ లక్ష్మీపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వీపీఆర్‌ నేత్ర రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్స్యకారులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మత్స్యకారుల వినతి మేరకు రామచంద్రాపురం పంచాయతీలో జెట్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 06:26 AM