హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ఏరియాలివే..
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:30 AM
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో శనివారం మరమ్మతుల నిమిత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. సాయిబాబాటెంపుల్ 11 కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు, బౌద్ధనగర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలోని మరమ్మతుల కారణంగా శనివారం 11కేవీ శివగంగా ఫీడర్ పరిధిలోని ఏపీఏయూ కాలనీ, భూలక్ష్మినగర్, గడ్డిఅన్నారం, ప్రగతి నగర్, సాహితీ నగర్, ఆర్బీఐ కాలనీ, శాంతినగర్ వెంకటగిరి పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు, గౌతం నగర్ ఫీడర్ పరిధిలోని భూలక్ష్మినగర్, దిల్సుఖ్నగర్, గడ్డిఅన్నారం, ఎంసీ కాలనీ, సత్యనారాయణ స్వామి టెంపుల్, శాంతినగర్, స్ర్టీట్ లైట్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.
రాజేంద్రనగర్: మైలార్దేవుపల్లి విద్యుత్ సెక్షన్ పరిధిలో విద్యుత్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సెక్షన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మైలార్దేవుపల్లి, బృందావన్ కాలనీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. దీంతో మొఘల్స్ కాలనీ, మైలార్దేవుపల్లి బస్తీ, బృందావన్ కాలనీ, టాటా నగర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. ప్రజలు అంతరాయానికి సహకరించాలన్నారు.
రాయదుర్గం: హుడాకాలనీ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు హుడాకాలనీ, చర్చిరోడ్, జయశంకర్ పార్కు రోడ్డులో విద్యుత్ ఉండదని అధికారులు తెలిపారు. అదేవిధంగా శాంతినగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 10నుంచి 12గంటల వరకు శాంతినగర్ టింబర్ డిపో, గంగారం ప్రాంతాల్లో.. ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు తారానగర్, శివాజీనగర్, వెంకటాద్రినగర్‌లో విద్యుత్ ఉండదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News