Share News

మహిళలకు నిర్ణయాధికారం కావాలి!

ABN , Publish Date - Nov 14 , 2026 | 07:06 AM

మహిళలకు సమాన హక్కులు కల్పించామని చెప్పుకోవడం గొప్ప కాదని.. ఆ హక్కులను వారు నిజంగా అనుభవించే పరిస్థితులు కల్పించటం ముఖ్యమని పలువురు దేశవిదేశీ మహిళా ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

మహిళలకు నిర్ణయాధికారం కావాలి!
Women Empowerment

  • మహిళా స్వేచ్ఛపై భారత్‌ సమ్మిట్‌లో ప్రతినిధుల అభిప్రాయం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహిళలకు సమాన హక్కులు కల్పించామని చెప్పుకోవడం గొప్ప కాదని.. ఆ హక్కులను వారు నిజంగా అనుభవించే పరిస్థితులు కల్పించటం ముఖ్యమని పలువురు దేశవిదేశీ మహిళా ప్రముఖులు అభిప్రాయపడ్డారు. హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భారత్‌ సమ్మిట్‌ 2026లో భాగంగా ‘జెండర్‌ జస్టిస్‌: ఏ ఫెమినిస్ట్‌ ఫ్యూచర్‌’ అనే అంశంపై శుక్రవారం చర్చ నిర్వహించారు. యూకే లేబర్‌ పార్టీ సభ్యురాలు కేట్‌ అర్నాయిడ్‌, భారత ఎంపీలు రేణుకా చౌదరి, జ్యోతిమణి సెన్నిమలై, దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేత టోంబికాయిసే సిభిడ్లా సఫేతా, మొరాకో సోషలిస్ట్‌ యూనియన్‌ ఆఫ్‌ పాపులర్‌ ఫోర్సెస్‌ (యూఎ్‌సఎ్‌ఫపీ) పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి ఖౌలా లచ్గర్‌ ఈ చర్చలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించడంతోనే బాధ్యత తీరిపోద ని.. కీలక నిర్ణయాలు తీసుకునే స్ధానాల్లోనూ మహిళలకు అవకాశం దక్కాలని అన్నారు. జ్యోతిమణి మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలుఒకేవిధంగా ఉన్నాయని రేణుకా చౌదరి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్‌పై కక్ష.. తెలంగాణపై వివక్ష

విభేదిస్తే దేశ ద్రోహులంటారా?

ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌ కొత్త కార్యాలయానికి సీఎం రేవంత్‌

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 07:06 AM