Share News

ప్రజాస్వామ్య రక్షణకు కలిసి నడుద్దాం

ABN , Publish Date - Nov 14 , 2026 | 07:18 AM

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రగతిశీల భావాలు కలిగిన శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని భారత్‌ సమ్మిట్‌ 2026కు హాజరైన ఫిలిప్పైన్స్‌ ప్రతినిధి వాన్‌ అభిప్రాయపడ్డారు.

ప్రజాస్వామ్య రక్షణకు కలిసి నడుద్దాం
Bharat Summit 2026

  • మితవాద విస్తరణను అడ్డుకొనేలా ప్రగతిశీల శక్తులు ఏకమవ్వాలి

  • భారత్‌ సమ్మిట్‌-2026లో వివిధ దేశాల ప్రతినిధుల వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రగతిశీల భావాలు కలిగిన శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని భారత్‌ సమ్మిట్‌ 2026కు హాజరైన ఫిలిప్పైన్స్‌ ప్రతినిధి వాన్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాతావరణ మార్పులు- మారుతున్న ప్రపంచ వ్యవస్థ అనే అంశాలపై చర్చలు జరిగాయి. ప్రజాస్వామ్యంపై జరిగిన చర్చలో వాన్‌ మాట్లాడుతూ.. పలు దేశాల్లో పెరిగిపోతున్న తీవ్ర మితవాద శక్తుల ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.


బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షవాది లూలా డసిల్వా విజయం సాధించడం, అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో డెమొక్రాట్లు గెలవటం వంటి పరిణామాలు ప్రగతిశీల శక్తుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయని అన్నారు. వాతావరణ మార్పులపై జరిగిన చర్చలో మాజీ ఎంపీ ప్రొఫెసర్‌ రాజీవ్‌ గౌడ, యూరోపియన్‌ యూనియన్‌ మాజీ సభ్యుడు జో లియనెన్‌, యూనిసెఫ్‌ మాజీ సలహాదారుడు గౌతమ్‌ నరసింహన్‌, కోస్టారికాకు చెందిన వాతావరణ నిపుణుడు జేవియర్‌ మోంగే మటమోరస్‌, మలేషియా మాజీ ఎంపీ కస్తూరి రాణి పట్టో, జపాన్‌ మాజీ ఎంపీ అకికో కామె పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 07:18 AM