Share News

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11.30 నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Nov 21 , 2026 | 08:16 AM

హైదరాబాద్ నగరంలోని సాయిరాంనగర్‌ కాలనీలో సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 11.30 నుంచి కరెంట్ కట్
Hyderabad Power Cut

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని సాయిరాంనగర్‌ కాలనీలో సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రీల్‌ బేకరి, జిల్లెలగూడ, సుల్తాన్‌వాల్వా, చంపాపేట, సాయిరాంనగర్‌, కర్మన్‌ఘాట్‌, అంజిరెడ్డినగర్‌, మారుతీనగర్‌, పద్మానగర్‌, నిర్మలానగర్‌, క్రాంతినగర్‌, పద్మానగర్‌, పవన్‌పురి, ప్రెస్‌కాలనీ, ఎస్‌ఎన్‌ రెడ్డినగర్‌, సాయిరాంనగర్‌ కాలనీ, గ్రీన్‌పార్కు కాలనీల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.


రాజేంద్రనగర్‌: ఐడీఏ మైలార్‌దేవుపల్లి ఫీడర్‌ పరిధిలో విద్యుత్‌ మరమ్మతుల కారణంగా శనివారం మధ్యాహ్నం 2 నుంచి 4:00 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో ఆయేషా కాలనీ, హషామాబాద్‌, టవర్‌ గల్లి, దస్తగిరి నగర్‌, హైవే హోటల్‌ గల్లీ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు.


zz.jpg

  • 11కేవీ రీగల్‌ గార్డెన్‌ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2:00 నుంచి 4:00గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయేషా కాలనీ, మిలాన్‌ కాలనీ, అన్‌మోల్‌ గార్డెన్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదన్నారు. ఫ మైలార్‌దేవుపల్లి పరిసర ప్రాంతాల్లోని దుర్గానగర్‌, కల్లు కాంపౌండ్‌, దుర్గాహిల్స్‌, నాగమల్లయ్య వెంచర్‌, దుర్గామాత టెంపుల్‌ ఏరియా, విజయ్‌ సేల్స్‌, కొత్త మెహిఫిల్‌ హోటల్‌, శ్రీనివాస హాస్పిటల్‌ ప్రాంతాల్లో శనివారం మధ్యా హ్నం 2:30 నుంచి 3:30 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు!

22 నుంచి ఎస్‌ఐ పరీక్షల అభ్యర్థులకు హాల్‌ టికెట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 08:16 AM