Share News

ఏసీబీ అధికారులకు చిక్కిన వార్డు అధికారి

ABN , Publish Date - Nov 21 , 2026 | 06:51 AM

ఇంటి మ్యూటేషన్‌కు సంబంధించి రూ.30వేలు లంచం తీసుకున్న వార్డు ఆఫీసర్‌ రవీందర్‌ రెడ్డిని ఏసీబీ రంగారెడ్డి రేంజ్‌ అధికారులు పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులకు చిక్కిన వార్డు అధికారి

హైదరాబాద్‌, మేడ్చల్‌ టౌన్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఇంటి మ్యూటేషన్‌కు సంబంధించి రూ.30వేలు లంచం తీసుకున్న వార్డు ఆఫీసర్‌ రవీందర్‌ రెడ్డిని ఏసీబీ రంగారెడ్డి రేంజ్‌ అధికారులు పట్టుకున్నారు. పూర్వీకుల ఇంటిని తన పేరిట మార్చాలని కుత్బుల్లాపూర్‌ ఎల్లంపేట మున్సిపల్‌ వార్డు ఆఫీసర్‌ రవీందర్‌ రెడ్డిని రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన వ్యక్తి కలిశారు.


రూ.40వేలు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పడంతో రూ.30వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఉచితంగా జరగాల్సిన పనికి లంచం అడగటంతో ఆయన ఏసీబీ అఽధికారులకు ఫిర్యాదు చేశారు. రవీందర్‌ రెడ్డి లంచం తీసుకున్నాక ఏసీబీ అధికారుల బృందం వార్డు కార్యాలయంలోకి వచ్చి సోదా చేయడంతో రూ.30వేల నగదు దొరికింది. దీంతో ఆయన్ను అరెస్టు చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 06:51 AM