Share News

Rajendra Nagar Police: బాబోయ్.. గంజాయి ఇలా కూడా పండిస్తారా.. యువకుడు తెలివితేటలు మామూలుగా లేవుగా..

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:04 PM

గంజాయి, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్‌కు చెందిన యువకుడు ఏకంగా కిస్మత్‌పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు.

Rajendra Nagar Police: బాబోయ్.. గంజాయి ఇలా కూడా పండిస్తారా.. యువకుడు తెలివితేటలు మామూలుగా లేవుగా..
Rajendra Nagar Police

హైదరాబాద్, జనవరి1 (ఆంధ్రజ్యోతి): గంజాయి(cannabis), డ్రగ్స్‌పై (Drugs) తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా బిహార్‌కు చెందిన యువకుడు ఏకంగా కిస్మత్‌పురలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి సాగుచేస్తున్నాడు. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు (Rajendra Nagar Police) ఇవాళ(గురువారం) తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో కిస్మత్‌పురలో గుడిసెల చుట్టూ పక్కల ప్రాంతాల్లో బిహారీకి చెందిన ఓ యువకుడు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో గంజాయి మొక్కలు పెంచుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు రాజేంద్ర నగర్ పోలీసులు.


కిస్మత్‌పుర నిర్మానుష్య ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ యువకుడు గంజాయి మొక్కలను పెంచుతున్నారనే సమాచారం తమకు అందిందని తెలిపారు. పక్కా సమాచారంతో తనిఖీలు చేసి నిందితుడిని అందుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. నిందితుడుని విచారించగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. గత ఐదు నెలలుగా ఉత్తరప్రదేశ్‌కి చెందిన రాజేందర్ అనే యువకుడు గంజాయి సాగు చేస్తున్నారని అన్నారు.


చుట్టుపక్కల ఉన్న యువకులకు గంజాయి సప్లై చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. యువకుడిపై కేసు నమోదు చేసి మరింత సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ తనిఖీ ద్వారా నేరస్థుల్లోని నేరప్రవృత్తిని నియంత్రించడమే కాక, ప్రజల భద్రతను, మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్‌ అమ్మిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ పోలీసులు హెచ్చరించారు.


పేట్ బషీరాబాద్‌లో...

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుచిత్ర సర్కిల్‌లో మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఈరోజు తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు చేస్తున్న ఎనిమిదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుచిత్రలోని మితిలేశ్ అనే వ్యక్తి దగ్గరి నుంచి 4.5 గ్రాముల హెరాయిన్, కొకైన్ తీసుకెళ్లేందుకు ఏడుగురు వ్యక్తులు వచ్చారు. పోలీసులకు పక్కాగా సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిందితుల దగ్గరి నుంచి కొకైన్‌తో పాటు ఓ యాక్టివా బైక్, 6మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు.


ఈ వార్తలు కూడా చదవండి..

పబ్బులపై ఈగల్ టీం సోదాలు.. డీజేలు అరెస్ట్..

ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

For More TG News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 07:21 PM