ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మహిళకు రూ.37.40 లక్షల టోకరా.. నలుగురి అరెస్ట్
ABN , Publish Date - Oct 16 , 2026 | 06:21 PM
అధిక లాభాల ఆశ చూపించి ఓ మహిళ నుంచి రూ.37 లక్షలు దోచుకున్న కేసులో హైదరాబాద్ పోలీసులు నలుగురు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి నుంచి మొబైల్ ఫోన్లు, చెక్బుక్కులను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 16: అధిక లాభాల ఆశ చూపించి ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం మేరకు.. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపించిన కొందరు దుండగులు.. ఓ మహిళ నుంచి రూ.37.40 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మ్యూల్ బ్యాంకు ఖాతాలు, సిమ్కార్డులు, 9 మొబైల్ ఫోన్లు, 10 డెబిట్, క్రెడిట్ కార్డులు, 8 చెక్బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో మ్యూల్ ఖాతాపై రూ.10 వేల కమీషన్ ఆశ చూపించి.. సైబర్ నేరగాళ్లకు వీటిని అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ ముఠాపై 54 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ మొత్తం కేసులలో సుమారు రూ. 10 కోట్ల మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పుంగనూరు దాడులపై ఎస్ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ ఎంపీ: వర్ల రామయ్య
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం
For More TG News And Telugu News