పుంగనూరులో వైసీపీ దాడులపై ఎస్ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ ఎంపీ: వర్ల రామయ్య
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:02 PM
పుంగనూరులో వైసీపీ దాడులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)కు అన్ని ఆధారాలు అందించామని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబుతో పాటు ఆయన కలిశారు.
అమరావతి, అక్టోబర్16: పుంగనూరులో వైసీపీ దాడులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)కు అన్ని ఆధారాలు అందించామని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబుతో పాటు ఆయన కలిశారు. అనంతరం కార్యాలయం బయట ఎమ్మెల్సీ వర్ల రామయ్య విలేకర్లతో మాట్లాడుతూ.. అంత పెద్ద కాన్వాయ్తో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
నామినేషన్ వేసేందుకు వెళ్లే వాళ్లతో ఏకంగా 32 కార్లతో వెళ్లి ఎన్నికల నియమావళిని ఎంపీ మిథున్ రెడ్డి ఉల్లంఘించారని విమర్శించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రంలోకి కేవలం రెండు కార్లు, అభ్యర్థితో కలిపి ఐదుగురు వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు. నామినేషన్ కేంద్రం వద్ద తమ వాళ్లపై కర్రలతో దాడులకు పాల్పడి, వాహనాల అద్దాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పుంగనూరులో అల్లర్లు సృష్టించేందుకు తమిళనాడు (తిరుత్తణి), కర్ణాటక రాష్ట్రాల నుంచి రౌడీషీటర్లను బరిలోకి దించారంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఈ దౌర్జన్యాలు, అరాచకాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోల ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునీఠాకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.
దౌర్జన్యాలు, గూండాయిజంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం చూస్తూ ఊరుకోదని వైసీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ప్రభుత్వం, వ్యవస్థలు కఠినంగా అణచివేస్తాయని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం
మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’: ఏపీ డీజీపీ
For More AP News And Telugu News