హైదరాబాద్‌లో అయ్యప్ప పూజల ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్.. యువకుడి మృతి
ABN , Publish Date - Nov 27 , 2026 | 10:08 PM
హైదరాబాద్ మణికొండలో ఘోర విషాదం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ కోటర్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పక్కన అయ్యప్ప పూజల ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ ప్రమాదం సంభవించింది.
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మణికొండలో ఘోర విషాదం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ కోటర్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్ పక్కన ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఉదయ్ (18) అనే యువకుడు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందగా, సాయి అనే మరో వ్యక్తికి విద్యుత్ షాక్ తగలడంతో గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించి, వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయ్యప్ప పూజల సందడి ఉండాల్సిన చోట యువకుడి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్‌రెడ్డి
‘సర్’ పై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. బండి సంజయ్ ధ్వజం
పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News