Share News

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:58 PM

అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టుచేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టురట్టు
ganja smuggling

హైదరాబాద్, నవంబర్ 17: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 10.50 లక్షల విలువైన 21 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


పోలీసులు కథనం ప్రకారం.. అంతర్రాష్ట్ర గంజాయి రవాణా, విక్రయాలపై.. హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు గంజాయిని తరలిస్తూ దందా కొనసాగిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు. బాలాపూర్ పోలీసులు, చార్మినార్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి.. గంజాయి రవాణా చేస్తున్న ముఠాపై దాడి చేశారు.

ఈ ఆకస్మిక దాడిలో అంతరాష్ట్ర గంజాయి రవాణాదారుడు మహమ్మద్‌ను అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ మేరకు నిందితుడి నుంచి రూ. 10.50 లక్షల విలువైన 21 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని బెర్హంపూర్ నుంచి హైదరాబాద్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. కాగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్వాన్ తుపానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

జగన్‌కు లోకేశ్ మాస్ కౌంటర్.. లెక్కలతో ఫ్యాక్ట్ రిప్లై

రొయ్యల రైతులపై జగన్‌ది కపట ప్రేమ.. మా సర్కారుపై సాక్షిది అసత్య ప్రచారమే.. మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజం

Read Latest AP News And Telangana News

Updated Date - Nov 17 , 2026 | 05:01 PM