Share News

హైదరాబాద్‌లో హనీట్రాప్ కలకలం.. రూ.18 లక్షలు వసూలు చేసిన యువకుడి అరెస్ట్

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:47 PM

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో హనీట్రాప్ వ్యవహారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లతో యువకులను ట్రాప్ చేసి.. ఆపై బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో హనీట్రాప్ కలకలం.. రూ.18 లక్షలు వసూలు చేసిన యువకుడి అరెస్ట్

హైదరాబాద్, అక్టోబర్ 19: సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. ప్రేమ పేరుతో యువకులకు దగ్గరై.. ఆపై అందినకాడికి దోచుకుంటున్న ఓ యువకుడి గుట్టును పాతబస్తీ పోలీసులు రట్టుచేశారు. కాగా నిందితుడి ట్రాప్‌లో ఇతర రాష్ట్రాల యువకులు, విదేశీయులు కూడా ఉన్నట్లు గుర్తించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన కొండబత్తుల పవన్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి యువకులను ట్రాప్ చేస్తుంటాడు. ప్రేమ పేరుతో యువకులకు దగ్గరై వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సేకరిస్తాడు. అనంతరం వాటిని అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ.. బాధితుల నుంచి లక్షల్లో వసూలు చేస్తుంటాడు.


ఈ క్రమంలో ఓ యువకుడి నుంచి రూ.18 లక్షలు వసూలు చేయగా.. మరో రూ. 7.16 లక్షలు ఇవ్వాలంటూ పవన్ కుమార్ బెదిరించాడు. వేధింపులకు తాళలేని యువకుడు పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పవన్ అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుడి వద్ద 82 మందికి సంబంధించిన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 13 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్,14 ఫేక్‌బుక్ అకౌంట్లు, రెండు వాట్సాప్ ఖాతాలు, మూడు బ్యాంకు ఖాతాల వివరాలను గుర్తించారు. అనంతరం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

‘హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అమలాపురంలో ఉద్రిక్తత.. చలాన్ల వివాదంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 05:08 PM