Share News

కిచెన్‌లో ఈగలు.. బొద్దింకలు.. ఎలుకలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:14 AM

హైదరాబాద్‌ నగరంలోని పేరుగాంచిన హోటళ్లలో డొల్లతనం బయటపడుతోంది.

కిచెన్‌లో ఈగలు.. బొద్దింకలు.. ఎలుకలు
Hyderabad food safety raids

  • అపరిశుభ్ర వాతావరణంలో వంటలు

  • హోటళ్లు, బేకరీలు, మెస్‌లపై టీజీ సేఫ్‌ దాడులు

  • 50 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలోని పేరుగాంచిన హోటళ్లలో డొల్లతనం బయటపడుతోంది. తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసన్షియల్‌ డ్రగ్స్‌ (టీజీ సేఫ్‌) అధికారులు కూకట్‌పల్లి ప్రాంతంలోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, బేకరీలపై బుధవారం దాడులు చేశారు. 10 బృందాలుగా ఏర్పడిన టీజీ సేఫ్‌ అధికారులు చేసిన దాడుల్లో ఆయా హోటళ్లు రెస్టారెంట్లు, మెస్‌లు, బేకరీలలోని కిచెన్‌లలో బొద్దింకలు, ఈగలు ఎలుకలు ఉన్నట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణం,


రికార్డుల నిర్వహణ లేకపోవడం, సరైన నిల్వ విధానాలు అమలు చేయకపోవడం, నాణ్యత లేని ఉత్పత్తుల వినియోగం, చేస్తున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల శాంపిళ్లు సేకరించి ల్యాబ్‌కు పంపారు. భూలక్ష్మి మెస్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 30 కిలోల మటన్‌, 20 కిలోల చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


city4.2.jpgదాడులు చేసిన హోటల్స్‌ ఇవే..

దాదూస్‌ మిఠాయి వాటిక, గుమ్మడి ఫుడ్స్‌, ప్యారడైజ్‌ ఫుడ్‌కోర్ట్‌, కేఎస్‌ బేకర్స్‌, చైతన్య ఫుడ్‌కోర్ట్‌, గోదారి మిఠాయి, మణికర్ణిక లైవ్‌స్పేస్‌, లక్ష్మీ వెంగమాంబ హాస్టల్‌, పద్మావతి డీలక్స్‌మెస్‌, శ్రీబాలాజీ పీజీ, కేఎస్‌ మెన్స్‌ పీజీ, జీవీకే పీజీ, హోటల్‌ సితార గ్రాండ్‌, మెహఫిల్‌, కన్యక కంఫర్ట్‌, బేక్‌ మ్యాక్స్‌ ఫుడ్స్‌, మంది కింగ్‌, కూకట్‌పల్లి మంది, భాగ్యలక్ష్మి మెస్‌, హర్ష డీలక్స్‌మెస్‌.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 09:14 AM