ఎర్రకోట పేలుడు ఆత్మాహుతి దాడే: ఎన్‌ఐఏ
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:08 AM
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గతేడాది నవంబర్ 10న జరిగిన పేలుడు, ఆత్మాహుతి ఉగ్రదాడేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో గతేడాది నవంబర్ 10న జరిగిన పేలుడు, ఆత్మాహుతి ఉగ్రదాడేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చింది. ప్రధాన నిందితుడు ఉమర్ ఉన్‌నబీ ఐ20 కారులో కూర్చుని లోపలి నుంచే ఐఈడీ బాంబును పేల్చినట్టు ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో దాఖలు చేసిన 7,500 పేజీల చార్జిషీటులో పేర్కొంది. నాటి ఉగ్రదాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. వృత్తిరీత్యా వైద్యుడైన నబీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన నమూనాలకు డీఎన్ ఏ పరీక్ష నిర్వహించగా, ఆ సమయంలో నబీ కారులోనే ఉన్నాడని నిర్ధారణ అయిందని ఎన్‌ఐఏ పేర్కొంది. దాడి కోసం రెండేళ్ల ముందుగానే 2023 నుంచే ఎర్రకోట పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు తెలిపింది. అల్‌ఖైదా అనుబంధ విభాగమైన ‘అన్సార్ గజ్వత్ ఉల్ హింద్’ మాడ్యూల్‌ను పునరుద్ధరించడంతోపాటు.. ఈ మాడ్యూల్‌కు అతడే కీలక సూతధ్రారిగా వ్యవహరించాడని ఎన్‌ఐఏ తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News