శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు భా‘రథ’ సారథ్యం
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:52 AM
భారత్‌లోని కాన్పూర్‌కు చెందిన విపుల్ మిశ్రాను తమ తాత్కాలిక సీఈఓగా నియమిస్తున్నట్టు...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: భారత్‌లోని కాన్పూర్‌కు చెందిన విపుల్ మిశ్రాను తమ తాత్కాలిక సీఈఓగా నియమిస్తున్నట్టు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. మిశ్రా ఇప్పటికే శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఇంజినీరింగ్ విభాగం చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విమాన ఇంజినీరింగ్, విమానయాన రంగంలో మిశ్రాకు ఇరవై ఏళ్లకుపైగా ఉన్న నాయకత్వ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన్ని ఈ పదవిలో నియమించినట్టు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. దేశీయ ఎయిర్‌లైన్స్ అయిన ఎయిరిండియా, ఇండిగో విదేశీయులను తమ సీఈఓలుగా నియమిస్తుంటే శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ భారతీయుడిని తన తాత్కాలిక సీఈఓగా నియమించడం విశేషం.
ఇవి కూడా చదవండి..
ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..
మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..