Share News

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో కుచ్చుటోపీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:56 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తులను రూ.1.38 కోట్ల మేర మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని బాచుపల్లికి చెందిన 68 ఏళ్ల రిటైర్డ్‌ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా దివ్య అయ్యర్‌ అనే మహిళ పరిచయమైంది.

ఆన్‌లైన్‌  ట్రేడింగ్‌ పేరుతో కుచ్చుటోపీ
Online Trading Scam

  • రూ.1.38 కోట్ల మేర మోసగించిన నేరగాళ్లు

  • హైదరాబాద్‌లో ఘటన.. పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఇద్దరు వ్యక్తులను రూ.1.38 కోట్ల మేర మోసం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని బాచుపల్లికి చెందిన 68 ఏళ్ల రిటైర్డ్‌ ఇంజినీర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా దివ్య అయ్యర్‌ అనే మహిళ పరిచయమైంది. రిటైర్డ్‌ ఇంజనీర్‌ను ఓ వాట్సాప్‌ గ్రూపులో చేర్చి ‘ఈక్యూఆర్‌ హెచ్‌ఎన్‌ఐ’ అనే నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించింది. సంస్థాగత షేర్లు, ఐపీఓల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించింది. తొలుత రూ.లక్ష పెట్టుబడికిగాను రూ.72 వేలు వెనక్కి రావటంతో అతడికి నమ్మకం కలిగింది. దీంతో బంధువులు, స్నేహితుల నుంచి అప్పులు తీసుకుని విడతలవారీగా రూ.1.29 కోట్లు బదిలీ చేశాడు.


యాప్‌లో పెట్టుబడులు, లాభాలు కలిపి రూ.15.23కోట్లు ఉన్నట్లు చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే రూ.2.06 కోట్ల కమీషన్‌ చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. మరో ఘటనలో ఆర్‌సీ పురానికి చెందిన 36 ఏళ్ల స్విగ్గీ డెలివరీ బాయ్‌ హరికుమార్‌కు టెలిగ్రాం ద్వారా కోరా అనే మహిళ పరిచయమైంది. బ్లాక్‌ ట్రేడింగ్‌, అప్పర్‌ సర్క్యూట్‌ షేర్లు, ఐపీఓలలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించింది. ‘అనాన్‌ క్యాపిటల్‌’ అనే నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి విడతలవారీగా రూ.10 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టించింది. రూ.53.35 లక్షల వర్చువల్‌ లాభం వచ్చినట్లు చూపించి, నగదు వెనక్కి తీసుకోవాలంటే అదనంగా రూ.12లక్షలు పన్ను చెల్లించాలని డిమాండ్‌ చేసింది. దీంతో బాధితుడు పోలీసులను కలిసి ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 05:56 AM