ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట లక్షలు టోకరా!
ABN , Publish Date - Nov 12 , 2026 | 05:08 AM
ఆన్‌లైన్‌లో ట్రేడింగ్, భారీగా లాభాలంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో మరో ఇద్దరు పడ్డారు. నకిలీ యాప్‌లో పెట్టుబడులు పెట్టించి లక్షల రూపాయలు కాజేశారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో ట్రేడింగ్, భారీగా లాభాలంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వలలో మరో ఇద్దరు పడ్డారు. నకిలీ యాప్‌లో పెట్టుబడులు పెట్టించి లక్షల రూపాయలు కాజేశారు. మరోవైపు ఆన్‌లైన్ లింకులతో ఫోన్లలో రహస్య యాప్‌లు ఇన్‌స్టాల్ చేసి, ఖాతాల వివరాలు కాజేసి.. మరో ఇద్దరికీ లక్షల కొద్దీ టోపీ పెట్టారు. బుధవారం ఈ నాలుగు ఘటనలకు సంబంధించి వేర్వేరుగా సైబర్ క్రైమ్ పోలీ్‌సస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. బాచుపల్లికి చెందిన రూపేశ్ కుమార్ పెర్లా ఐటీ ఉద్యోగి. ఆగస్టు 23న ఆయనకు ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రకటన కనిపించింది. దానిపై క్లిక్ చేయడంతో ‘ఈక్విరస్ లీప్ ఎ606’ అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు.
దివ్య అయ్యర్ అనే వ్యక్తి ఆర్థిక సలహాదారుగా పరిచయం చేసుకుని ‘ఈక్యూఆర్ హెచ్‌ఎన్‌ఐ’ యాప్‌ను రూపేశ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయించారు. తొలుత చిన్న మొత్తాలతో పెట్టుబడులు పెట్టించి లాభాలు చూపించారు. తర్వాత ఐపీఓలు, డిస్కౌంట్ ట్రేడింగ్ పేరుతో రూ.33.36 లక్షలు పెట్టుబడులు పెట్టించి, మోసం చేశారు. ఇక నిజాంపేట రోడ్డులోని సత్య ఎన్‌క్లేవ్‌లో నివసించే 38 ఏళ్ల ఐటీ ఉద్యోగి భరత్‌కుమార్‌రెడ్డికి అక్టోబర్ 31న బంబుల్ డేటింగ్ యాప్‌లో తనిషారెడ్డి పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకోవడంతో పాటు ప్రొఫెషనల్‌గా ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తానని, భారీగా లాభాలు వస్తాయని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన భరత్.. పలు దఫాలుగా రూ.5.49లక్షలు బదిలీ చేశారు. కానీ తర్వాత అది మోసమని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రెడిట్ కార్డు నుంచి రూ.34.44 లక్షలు మాయం!
ప్రముఖ వీడియో సంస్థ వోల్గా వీడియోస్, వోల్గా న్యూస్ వ్యవస్థాపకుడు గుడూరు ప్రసాద్ క్రెడిట్ కార్డు నుంచి సైబర్ నేరగాళ్లు రూ.34.44 లక్షలు కాజేశారు. అమెజాన్ ముంబై, అమెజాన్ బీడీ పేర్లతో ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో తన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు నుంచి అనధికారికంగా లావాదేవీలు జరిగాయని, ఓటీపీలు, నోటిఫికేషన్లు రాలేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మొబైల్‌లో అనుమానాస్పద యాప్ ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. ఇక కూకట్‌పల్లికి చెందిన భామిడిపాటి వెంకట లక్ష్మీనారాయణకు ఐడీబీఐ బ్యాంకులో ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి జూన్ 29 నుంచి అక్టోబర్ 29 మధ్య పది అనధికారిక లావాదేవీల్లో రూ.5.94 లక్షలు బదిలీ అయ్యాయి. ఈ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఓటీపీలు రాలేదని, నగదు డెబిట్ అయినట్టు మెసేజీలు కూడా రాలేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఆంధ్రకు నీళ్లు.. తెలంగాణకు ఎక్కిళ్లు
ప్రజాస్వామ్య పరిరక్షణకే భారత్ సమ్మిట్ 2.0
Read Latest Telangana News And AP News And National News
And Telugu News