Share News

లష్కర్‌ బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Aug 01 , 2026 | 09:42 AM

లష్కర్‌ బోనాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు చేపట్టామని ఆర్టీసీ గ్రేటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.

లష్కర్‌ బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Lashkar Bonalu special buses

హైదరాబాద్‌ సిటీ: లష్కర్‌ బోనాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి 175 ప్రత్యేక బస్సులు నడపడానికి చర్యలు చేపట్టామని ఆర్టీసీ గ్రేటర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌, కాచిగూడ రైల్వేస్టేషన్‌, జేబీఎస్‌, చార్మినార్‌, బాలాజీనగర్‌, నాంపల్లి, రిసాల్‌బజార్‌, వెంకటాపురం, ఓల్డ్‌ అల్వాల్‌, మెహిదీపట్నం, కుషాయిగూడ, చర్లపల్లి, హకీంపేట, ఓల్డ్‌ బోయిన్‌పల్లి, చార్మినార్‌, మెహిదీపట్నం,


city4.2.jpgసైనిక్‌పురి, సనత్‌నగర్‌, జామై ఉస్మానియా, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కేపీహెచ్‌బీ, బోరబండ, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులు, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేసింది.


హెల్ప్‌ డెస్క్‌లు

  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ - 9959226147

  • జూబ్లీబస్‌ స్టేషన్‌ (జేబీఎస్‌) - 9959226143

  • మహాత్మాగాంధీ బస్‌ స్టేషర్‌ (ఎంజీబీఎస్‌) - 9959226130

  • జోనల్‌ కమ్యూనికేషన్‌ సెల్‌, జూబ్లీబ్‌సస్టేషన్‌ - 9959226160


ఈ వార్తలు కూడా చదవండి:

రేపటి నుంచి సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 01 , 2026 | 09:42 AM