భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..
ABN , Publish Date - Aug 01 , 2026 | 09:17 AM
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.200కు పైగా తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం ప్రకటించాయి.
ఇంటర్నెట్ డెస్క్: హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఊరట లభించింది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.200కు పైగా తగ్గిస్తున్నట్టు చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం ప్రకటించాయి. ఇరాన్ యుద్ధం, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా వరుసగా ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ ధరలను క్రమంగా తగ్గిస్తున్నారు (Commercial LPG price cut).
ఇటీవలి కాలంలో ఇది వరుసగా రెండో తగ్గింపు కావడం విశేషం. జులైలో వాణిజ్య సిలింబర్ ధరలను రూ.183 తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శనివారం) మరో రూ.202 రూపాయలను తగ్గించారు. దీంతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.202 తగ్గి రూ.2,728కు చేరింది. కోల్‌కతాలో రూ.209 తగ్గి రూ.2,872.50కి చేరింది (LPG cylinder price today).
ముంబై, చెన్నై, హైదారాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లో కూడా గణనీయంగా ధరలు తగ్గాయి. అయితే ఈ తగ్గింపు వాణిజ్య వినియోగ సిలిండర్లకే పరిమితం (LPG rates August 2026). గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. దీంతో సాధారణ కుటుంబాలకు ఈసారి ఎలాంటి ఉపశమనం లభించలేదు.
ఇవి కూడా చదవండి..
చంద్రుడిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. శాస్త్రవేత్తలలో ఉత్కంఠ..
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..