హైదరాబాద్‌లో బిల్లు డబ్బుల కోసం తుపాకీతో యువకుడి బెదిరింపులు
ABN , Publish Date - Oct 24 , 2026 | 06:50 PM
హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో రివాల్వర్‌తో ఓ యువకుడు కలకలం సృష్టించాడు. బిల్లు డబ్బుల కోసం కస్టమర్లు, బౌన్సర్లపై తుపాకీతో బెదిరింపులకు దిగాడు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌లో రివాల్వర్‌తో ఓ యువకుడు కలకలం సృష్టించాడు. బిల్లు డబ్బుల కోసం కస్టమర్లు, బౌన్సర్లపై తుపాకీతో బెదిరింపులకు దిగాడు. బార్ అండ్ రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బందితో సదరు యువకుడు నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థార్ కారులో నుంచి రివాల్వర్‌ను యువకుడు తీశాడు.
తాను చెల్లించిన బిల్లు డబ్బులు వెనక్కు ఇవ్వకపోతే కాల్చేస్తా అంటూ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో భయంతో సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. నిందితుడు మహ్మద్ షానవాజ్ (24)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రివాల్వర్, థార్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బౌన్సర్లు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. యువకుడిపై బార్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News