Share News

పైపై మెరుగులు.. కల్తీ ఆహార పదార్థాలు

ABN , Publish Date - Oct 30 , 2026 | 08:30 AM

స్వీట్ల దుకాణాలు.. బేకరీ ఆహార ఉత్పత్తులకు రోజురోజు డిమాండ్‌ పెరిగింది. ఇంట్లో చిన్నపాటి శుభకార్యాలయాకు, ఇతర అవసరాలకు ప్రజలు స్వీట్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు.

పైపై మెరుగులు.. కల్తీ ఆహార పదార్థాలు
Hyderabad Food Safety

  • బేకరీలు, స్వీటు షాపుల్లో విక్రయాలు

హైదరాబాద్: స్వీట్ల దుకాణాలు.. బేకరీ ఆహార ఉత్పత్తులకు రోజురోజు డిమాండ్‌ పెరిగింది. ఇంట్లో చిన్నపాటి శుభకార్యాలయాకు, ఇతర అవసరాలకు ప్రజలు స్వీట్‌ షాపులను ఆశ్రయిస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దవారు కూడా వయస్సుతో తేడా లేకుండా బేకరీలకు ప్రతిరోజు క్యూ కడుతున్నారు. దీన్ని ఆసరటీ లఅసుకొని దుకాణాల నిర్వాహాకులు నిబంధనలు పాటించడం లేదు. హానికరమైన కృత్రిమ రంగులు, కల్తీ నునె, నెయ్యి, పాలు వాడుతున్నా ఫుడ్‌సేఫ్టీ అధికారులు అటువైపు చూడటంలేదు. ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయి.


తూతూ మంత్రంగా పర్యవేక్షణ

ఫిర్యాదులు వస్తేనే ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అవీ కూడా నామమాత్రంగానే చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారులు, ఎంఎంసీ కార్పొరేషన్‌ అధికారులు సమన్వయం చేసుకోని ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపాలి. కానీ ఇవేం జరగడంలేదు.


city3,2.jpgకనిపించని పరిశుభ్రత

  • స్వీట్‌ షాపుల్లో బేకరీల్లో, హోటళ్లలో వ్యక్తిగత పరిశుభ్రత కనపడటం లేదు.

  • వాడిన వంట నూనెలనే తిరిగి వినియోగిస్తున్నారు.

  • క్రిమికీటకాలకు నివారణ కోసం ఉపయోగించే మిషన్స్‌ ఉండవు.

  • కొన్ని బేకరీల్లో ఎలాంటి ప్రమాణాలను పాటించకుండనే బ్రెడ్‌, ఎగ్‌పఫ్‌, కర్రీపఫ్‌, కేక్‌లను తయారు చేస్తున్నారు.

  • కేకుల్లో వాడే బటర్‌, క్రీమ్‌, విఫ్డ్‌ క్రిమ్‌, కస్టర్డ్‌ ఆహార పదార్థాల నిలువలను సరైన ఉష్ణోగ్రతల్లో నిలువ ఉంచడం లేదు.

  • అల్వాల్‌ రోడ్లపై ఉన్న చిన్న చిన్న దుకాణాల్లో రానున్న దీపావళి సందర్భంగా కల్తీ నూనెలు, నెయ్యిల ద్వారా స్వీట్లు తయారు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే వారు టోపీలు, చేతులకు గ్లౌజ్‌లు ధరించడం లేదు.


ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..

బేకరీ, స్వీట్‌ షాప్‌, బయటి హోటళ్లల్లో ప్రతి రోజు తింటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలుంటాయి. అనుమతి లేని రంగులు, కలుషిత పదార్థాలు కలిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయడానికి ఆస్కారం ఉంది. అధిక చెక్కెర, కేలరీలు ఉన్న క్రీమ్‌ ఉత్పత్తులు, మైదాతో తయా రు చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల బరువు పెరుగుతారు, రక్తంలో చక్కెర నియంత్రణ కష్టమవుతుంది హర్ట్‌ సమస్యలు గ్యాస్ట్రిక్‌ వంటి సమస్యలు వస్తాయి.

  • మేడ్చల్‌-మల్కాజిగిరి, డీఎంహెచ్‌వో ఆనంద్‌


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 08:54 AM