Share News

ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ బురిడీ

ABN , Publish Date - Oct 30 , 2026 | 07:09 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఇద్దరి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.29.91 లక్షలు కాజేశారు.

ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ బురిడీ
cyber crime

  • ఇద్దరి నుంచి రూ.29.91 లక్షలు కాజేసిన నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఇద్దరి నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.29.91 లక్షలు కాజేశారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన 49 ఏళ్ల మెడికల్‌ రైటర్‌ (బాధితుడు)కు ఆగస్టులో ఫేస్‌బుక్‌ ద్వారా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ లింక్‌ కనిపించింది. దానిపై క్లిక్‌ చేయడంతో ‘ఎస్‌ఐజీ గ్రూప్‌’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపులో చేరాడు. ‘నిఫ్టీపీడబ్ల్యూఎం’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని కేవైసీ పూర్తి చేశాడు.


మొదట రూ.5 వేలు పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చినట్లు చూపించారు. దీంతో సెప్టెంబరులో పలుమార్లు రూ.10.5 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత రూ.4 కోట్లకు పైగా విలువైన ఐపీవో యూనిట్లు కేటాయించినట్లు చూపించి, వాటి కోసం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. చివరకు రూ.2 లక్షలు చెల్లించినప్పటికీ ఉపసంహరణకు అవకాశం ఇవ్వలేదు. యాప్‌లో చూపించిన ట్రేడింగ్‌ లాభాలపై 20 శాతం సర్వీస్‌ చార్జీలు చెల్లించాలని, ఇందుకు రూ. 61లక్షలు అవసరమని పేర్కొనడంతో మోసపోయినట్లు గుర్తించాడు. తన రూ.10.5 లక్షలు పెట్టుబడుల్లో ఒక్క రూపాయి కూడా తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


city1.2.jpgసాఫ్ట్‌వేర్‌ఇంజనీర్‌కు రూ. 19.86 లక్షల నష్టం

వివేకానందనగర్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ‘ఐఎస్ఎల్‌ ఎక్స్‌క్లూజివ్‌ వీఐపీ53 రూమ్‌’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూపు ద్వారా సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కాడు. నేరగాళ్లు ‘ద ఐఐఎస్‌ నెక్సస్‌‘ యాప్‌ ద్వారా ట్రేడింగ్‌ చేయాలని సూచించి, మొదట రూ.5వేలు పెట్టుబడి పెట్టించారు. అక్టోబర్‌ 6న రూ.8లక్షలు జమ చేయించి బ్లాక్‌ ట్రేడింగ్‌ చేయించారు. డబ్బులు ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించగా రూ.5,11,640 బ్రోకరేజ్‌ సర్వీస్‌ ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ మొత్తాన్ని చెల్లించినప్పటికీ నగదు ఇవ్వలేదు. అనంతరం సెక్యూరిటీ డిపాజిట్‌ పేరుతో మరో రూ.5 లక్షలు వసూలు చేశారు. మొత్తం రూ. 20,44,360లు బదిలీ చేయగా, కేవలం రూ.58,199లు మాత్రమే తిరిగి వచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 07:09 AM