Share News

హైదరాబాద్‌-వత్వా మార్గంలో ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Sep 17 , 2026 | 07:44 AM

వినాయక చవితి పండుగతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ -వత్వా (అహ్మదాబాద్‌) మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

హైదరాబాద్‌-వత్వా మార్గంలో ప్రత్యేక రైళ్లు
Hyderabad Ahmedabad Special Trains,

  • 19, 21న ప్రయాణికులకు అందుబాటులో..

హైదరాబాద్‌ సిటీ: వినాయక చవితి పండుగతో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్‌ -వత్వా (అహ్మదాబాద్‌) మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07087 ప్రత్యేక రైలు హైదరాబాద్‌ నుంచి ఈ నెల 19న రాత్రి 8.15 గంటలకు, 07088 ప్రత్యేక రైలు వత్వా నుంచి ఈ నెల 21న ఉదయం 3.30గంటలకు బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. ఈ రైళ్లకు బేగంపేట్‌, లింగంపల్లి, వికారాబాద్‌, తాండూరు, వాడి, కలబురగి, సోలాపూర్‌, డౌండ్‌, పుణె, కల్యాణ్‌, వసాయ్‌ రోడ్‌, వల్సాద్‌, సూరత్‌, వడోదరా స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు.


city2.2.jpg

city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 17 , 2026 | 07:44 AM