Share News

ఆదివాసీ స్కూల్‌ టీక్‌ కరో

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:48 AM

దేశంలో గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు 80 ఏళ్లుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు.

ఆదివాసీ స్కూల్‌ టీక్‌ కరో

  • నేడు గడ్చిరోలి నుంచి సీజేపీ ఉద్యమం

నాగ్‌పూర్‌, న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: దేశంలో గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు 80 ఏళ్లుగా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ఆరోపించారు. అందువల్ల గురువారం నుంచి మహారాష్ట్రలోని గడ్చిరోలి నుంచి ‘ఆదివాసీ స్కూల్‌ టీక్‌ కరో ఆందోళన్‌’ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. నాగ్‌పూర్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటోన్న సమస్యలు, వివక్షను ప్రభుత్వాల దృష్టికి తేవడమే ఈ ఆందోళన లక్ష్యమన్నారు. సీజేపీ ప్రతినిధులు గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి అక్కడి మౌలిక వసతులు, సదుపాయాలను పరిశీలిస్తారని తెలిపారు. దాదాపు అన్ని ప్రభుత్వాలు గిరిజన విద్యార్థులను నిర్లక్ష్యం చేశాయని అన్నారు. రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతీ జిల్లాలో తమ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నాయి గానీ గిరిజన గురుకుల పాఠశాలలకు కేటాయించడానికి వాటికి నిధులు లేవని విమర్శించారు.

Updated Date - Sep 17 , 2026 | 06:49 AM