Share News

లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడంటూ యూపీలో ఓ ఉపాధ్యాయుడి కాల్చివేత

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:57 AM

ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన పనిచేసే పాఠశాలలోనే ఓ వ్యక్తి ఆయన్ను తుపాకీతో కాల్చి చంపాడు.

లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నాడంటూ యూపీలో ఓ ఉపాధ్యాయుడి కాల్చివేత

బిజ్నూర్‌, సెప్టెంబరు 16: ఉత్తరప్రదేశ్‌లో ఓ ఉపాధ్యాయుడు లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన పనిచేసే పాఠశాలలోనే ఓ వ్యక్తి ఆయన్ను తుపాకీతో కాల్చి చంపాడు. నజీబాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సౌపురి గ్రామంలో ఈ ఘటన జరిగింది. హత్య తర్వాత నిందితుడు గౌరవ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 4నెలల క్రితం సౌపురి గ్రామానికి చెందిన ఓ యువతిని తాలిబ్‌ అనే యువకుడు బైక్‌ మీద తీసుకువెళ్లాడని, తాలిబ్‌ను యువతి తల్లిదండ్రులు మందలించారని, అయినప్పటికీ తాలిబ్‌ ఆ యువతిని కలవడం మానుకోలేదని, దీనికి ఆ ఊరి పాఠశాల ఉపాధ్యాయుడు నౌషాద్‌ సాయం చేసేవారని గౌరవ్‌ పోలీసులకు తెలిపాడు. నౌషాద్‌ చేసింది లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహించడమేనని అందుకే ఆయన్ను కాల్చిచంపేశానని వివరించాడు.

Updated Date - Sep 17 , 2026 | 06:58 AM