గాదె ఇన్నయ్యను విడుదల చేయాలి
ABN , Publish Date - Mar 27 , 2026 | 08:35 AM
మావోయిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్న కవులు, కళాకారుల కన్నీటిని, స్నేహాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మాననీయకోణంలో చూడాలని, నేరంగా చూడవద్దని ప్రొఫెసర్ జి.హరగోపాల్ కోరారు.
హైదరాబాద్: మావోయిస్టుల అంత్యక్రియల్లో పాల్గొన్న కవులు, కళాకారుల కన్నీటిని, స్నేహాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మాననీయకోణంలో చూడాలని, నేరంగా చూడవద్దని ప్రొఫెసర్ జి.హరగోపాల్(Professor G. Haragopal) కోరారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పౌర హక్కుల సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సెప్టెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన కాతా రామచంద్రరెడ్డి అంత్యక్రియలకు హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి, రచయిత దేశపతి శ్రీనివాస్, ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్‌తోపాటు పలువురు రచయితలు, కవులు, పౌర హక్కుల సంఘాల నేతలకు నోటీసులు జారీ చేసి ఎన్‌ఐఏ వేధింపులకు గురిచేస్తుందని అన్నారు.
గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి జైలులో పెట్టారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. గాదె ఇన్నయ్యను బేషరతుగా విడుదల చేసి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాతా రామచంద్రరెడ్డి సతీమణి మాలతి, కుమారుడు రాజాలు మాట్లాడుతూ మావోయిస్టు నేత రామచంద్రారెడ్డి బూటకపు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారణ చేయాలని, ఎన్‌ఐఏ జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం లక్ష్మణ్, ఎన్.నారాయణరావు, ఐఏపీఎల్ ప్రతినిధి డి. సురేష్ కుమార్, భరద్వాజలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు భద్రాద్రి రామయ్యకు కల్యాణం.. రేపు మహాపట్టాభిషేకం..
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News