భారీ లాభాలు, వడ్డీ పేరుతో మోసం.. రూ.5.70 కోట్లు కాజేశారు!
ABN , Publish Date - Mar 27 , 2026 | 07:57 AM
వ్యాపారంలో భారీ లాభాలు, వడ్డీ ఆశచూపి ఏకంగా రూ.5.70 కోట్లు కాజేసిన ఘటనపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్స్ ) పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్ సిటీ: వ్యాపారంలో భారీ లాభాలు, వడ్డీ ఆశచూపి ఏకంగా రూ.5.70 కోట్లు కాజేసిన ఘటనపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్స్ ) పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాకు చెందిన మంత్రి బాలకృష్ణ 2021లో నిజాంపేట్‌కు చెందిన వ్యక్తిని సంప్రదించి పండ్ల డీలర్‌షిప్ సహా పలు వ్యాపారాల గురించి వివరించాడు. భారీ లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాడు. తొలుత తీసుకున్న డబ్బును తిరిగి చెల్లిస్తూ నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత ‘శ్రీ రామ్ దేవ్ బాబా ఆపిల్ ఏజెన్సీ‘ పేరుతో నకిలీ ఒప్పందాలు చూపించి, పెట్టుబడిపై నెలకు 3 శాతం వడ్డీ ఇస్తానని హామీ ఇచ్చి భారీ మొత్తంలో సేకరించాడు.
రూ.5.70 కోట్ల పెట్టుబడి
వడ్డీకి ఆశపడి బాధితుడు తన స్నేహితులు, పరిచయస్తుల వద్ద నుంచి సేకరించిన సొమ్మును పలు దఫాలుగా మొత్తం రూ.5.70 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. కొంత కాలం తర్వాత బాలకృష్ణ పరారయ్యాడు. దీంతో ఒప్పందాలను, ప్రామిసరీ నోట్లను పరిశీలించగా నకిలీవని గుర్తించి బాధితుడు అవాక్కయ్యాడు. వ్యాపారం పేరుతో తన వద్ద తీసుకున్న డబ్బుతో కుటుంబసభ్యుల పేర్లపై బంగారం, ఆస్తులు కొనుగోలు చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లు 318(4), 316(2), 338,336(3),340(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు భద్రాద్రి రామయ్యకు కల్యాణం.. రేపు మహాపట్టాభిషేకం..
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News