రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:43 AM
భారతీయ సంస్కృతిలోనూ, ధర్మ పరిరక్షణలోనూ అత్యంత విశిష్ఠమైన పర్వదినం శ్రీరామ నవమి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, మార్చి27: భారతీయ సంస్కృతిలోనూ, ధర్మ పరిరక్షణలోనూ అత్యంత విశిష్ఠమైన పర్వదినం శ్రీరామ నవమి. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని గొప్పతనాన్ని, ఆయన చూపిన ధర్మ మార్గం అందరికీ ఆదర్శం అన్నారు. సమాజంలో నైతిక విలువలు పెరగాలంటే రాముడి ఆశయాలే మార్గదర్శకమని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సందేశంలో శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ‘శ్రీరాముడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ఒక ఆదర్శ పురుషుడు, కర్తవ్య పరాయణుడు. ఆయన అవతరించిన రోజున, అలాగే కల్యాణం జరిగిన ఈ పవిత్ర ఘడియల్లో మనం శ్రీరామ నవమిని ఎంతో వైభవంగా జరుపుకొంటున్నాం. శ్రీరాముడి పాలన అంటేనే ప్రజారంజక పాలన. అటువంటి రామరాజ్యాన్ని మళ్ళీ స్థాపించుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. శ్రీరామచంద్రమూర్తి సుగుణాలను పునికిపుచ్చుకుని, ప్రతి ఒక్కరూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలి. ఆ శ్రీరాముడి కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ
Read Latest AP News