మార్కాపురం బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:35 PM
మార్కాపురంలో జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు విడుదలయ్యాయి.
అమరావతి, మార్చి 26: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు విడుదలయ్యాయి. అలాగే ఈ దుర్ఘటనలో మరో 22 మంది తీవ్రంగా గాయపడగా.. వారందరినీ వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.
మృతుల వివరాలు:
పెద్దరికట్ల గ్రామ వాసులు: అంబటి అనిల్, అంబటి లియో
చల్లగిరిగల గ్రామం కనిగిరి మండలం వాసులు: తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి
తింగారెడ్డి పల్లి గ్రామం కనిగిరి మండలం వాసులు: ఉప్పు రమాదేవి, బత్తుల పద్మ
చల్లగిరిగల గ్రామం కనిగిరి మండలం వాసులు: ముత్తంగి వెంకటేశ్వర్లు
నర్సింగ్ ప్రభావతి
నర్సింగ్ క్షేత్ర(6 సంవత్సరాలు) మృతి చెందారు.
మొత్తం 13 మంది చనిపోగా.. వారిలో 9 మందిని గుర్తించారు. మరో నలుగురి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై బాధితుల సహాయార్థం నెల్లూరు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో 7995575699, 08612331261 నంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన 15 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాల కోసం పైన తెలిపిన కంట్రోల్ రూమ్ నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
కుప్పంలో మూడో రోజుకు నారా భువనేశ్వరి పర్యటన
మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News