Share News

హేమచంద్ర హత్య కేసులో సంచలనం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు

ABN , Publish Date - Mar 27 , 2026 | 07:57 AM

అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చిన్నారి హేమచంద్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

హేమచంద్ర హత్య కేసులో సంచలనం.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు
Hemachandra Case

అనంతపురం, మార్చి 27: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో అపహరణకు గురైన బాలుడు హేమచంద్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చిన్నారికి బావ వరసయ్యే సర్వేశ్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలుడు హేమచంద్రను అతి దారుణంగా బండరాళ్లతో మోది హత్య చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చిన్నారి హేమచంద్ర హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.


కుందన కోట గ్రామం వద్ద బాలుడిని గొంతు నులిమి, రాయి తో కొట్టి కిరాతకంగా హత్య చేసిన నిందితుడు సర్వేశ్ కుమార్‌ను, క్రైమ్ సీన్ రీ-కన్స్ట్రక్షన్ నిమిత్తం పోలీసులు శుక్రవారం చింతలాయపల్లి-కుందనకోట ఘాట్ రోడ్డు ప్రాంతానికి తీసుకెళ్లారు. నేరం జరిగిన చోటు ను పరిశీలిస్తుండగా ఖాళీ బీర్ బాటిల్‌తో పోలీసుల పై దాడి చేసిన నిందితుడు. పోలీసులు హెచ్చరించినప్పటికీ అతను వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య. ఈ కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు. కాల్పుల అనంతరం నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని, చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బీర్ బాటిల్‌తో నిందితుడు చేసిన దాడి‌లో గాయపడిన పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఏపీలో ఇంటర్ సెకండియర్ సిలబస్ లీక్.. రంగంలోకి సైబర్ క్రైమ్ పోలీసులు

ఏప్రిల్‌ 1 నుంచి చికెన్‌ షాపులు బంద్‌!

Updated Date - Mar 27 , 2026 | 09:52 AM