హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:20 AM
గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటపాటు దంచికొట్టిన వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి.
ప్రధాన రహదారులను ముంచెత్తిన వరద
ఐటీ కారిడార్, జూబ్లీహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జాం
రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోనూ పలుచోట్ల వర్షం
నేడు, రేపు కూడా వర్షాలు: వాతావర ణ కేంద్రం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటపాటు దంచికొట్టిన వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతా ల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్‌పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బహుదూర్‌పురా, చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, నార్సింగ్‌ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలితో పాటు మైండ్‌స్పేస్, ఐకియా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రి 8 గంటల వరకు కీసరలో అత్యధికంగా 10.8 సెం.మీ, బహుదూర్‌పురాలో 8.2 సెం.మీ, శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ వర్షపా తం నమోదైంది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షా లు కురిసే అవకాశంఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం తెలిపింది.
ఆదివారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం,నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీచేసింది. మరోవైపు నవంబరు 4 వరకు నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో చాలాచోట్ల శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఘట్‌కేసర్, అబ్దుల్లాపూర్‌మెట్, గండిపేట, రాజేంద్రనగర్, ఉప్పల్, హయత్‌నగర్, కాప్రా, మొయినాబాద్, శంకరపల్లి, బాలానగర్, కందుకూరు, యాచారం, చేవెళ్ల, మంచాల, బంట్వారం, దుండిగల్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట, నార్కట్‌పల్లి, చిట్యాల, సూర్యాపేట, నల్లగొండలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో కోతలకు సిద్ధమైన వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సుల్లో ఢిల్లీకి తరలిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
బీజేపీతో పొత్తుకు బీఆర్‌ఎస్ తహతహ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News