Share News

రాష్ట్రమంతా కరువు

ABN , Publish Date - Oct 31 , 2026 | 05:05 AM

ఎల్‌నినో కారణంగా రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో చిక్కుకుంటే.. ప్రభుత్వం 365 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు.

రాష్ట్రమంతా కరువు
Bandi Sanjay Kumar

  • అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

రాజేంద్రనగర్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో కారణంగా రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో చిక్కుకుంటే.. ప్రభుత్వం 365 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. మిగిలిన మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైస్‌ రీసెర్చ్‌ (ఐఐఆర్‌ఆర్‌)లో శుక్రవారం జరిగిన పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


రైతు దినోత్సవాన్ని ప్రారంభించి.. రైతులు, శాస్త్రవేత్తలనుద్దేశించి మాట్లాడారు. రైతులకు నెలకు రూ.12 వేల ఆదాయం కూడా రావడం లేదని, సంవత్సరానికి ఒక రైతు రూ.1.5 లక్షలు మాత్రమే సంపాదిస్తున్నాడని చెప్పారు. అదే ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడని అన్నారు. రైతులకు చేయూతనివ్వడానికే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పఽథకాన్ని 2019 నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 30 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. అంతకుముందు ఐఐఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం శ్రీనివాసప్రసాద్‌ మాట్లాడుతూ.. బియ్యం ఎగుమతుల ద్వారా దేశం ఏటా రూ.1,000 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని సాధిస్తోందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ విస్తరణ

మాక్‌ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్య అవహేళన

హైదరాబాద్‌కు వచ్చేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 05:05 AM