బస్సుల్లో ఢిల్లీకి తరలిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:10 AM
ఓట్ బచావ్ - దేశ్ బచావ్ నినాదంతో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు.
హైదరాబాద్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ఓట్ బచావ్ - దేశ్ బచావ్ నినాదంతో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు కేటాయించక పోవడంతో జిల్లాల వారీగా టీపీసీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో వీరు వెళ్లారు. కొన్ని చోట్ల గురువారంనాడే బస్సులు బయలుదేరగా.. ఎక్కువ శాతం శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లాయి. మొత్తమ్మీద 70కి పైగా బస్సుల్లో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ బాట పట్టారు.
కాంగ్రెస్ పార్టీ మండల, బ్లాక్ కమిటీల అధ్యక్షులు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, తదితరులు ఈ బస్సు యాత్రల్లో ఉన్నారు. కొంతమంది నేతలు ఢిల్లీకి కార్లలో బయలుదేరి వెళ్లారు. వీరంతా శనివారం సాయంత్రం కల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు ఢిల్లీలో వీరికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకొందరు నేతలు, ప్రజాప్రతినిధులు ముందు చూపుతో రైళ్లు, విమానాల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. మొత్తమ్మీద ఆదివారం సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్ సహా కాంగ్రెస్ తెలంగాణ నాయకులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీలో హల్‌చల్ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాక్ పార్లమెంటు పేరిట ప్రజాస్వామ్య అవహేళన
హైదరాబాద్‌కు వచ్చేముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News